బ్యూటిఫుల్ స్మైల్‌‌‌‌తో కట్టి పడేస్తోన్న రష్మిక

బ్యూటిఫుల్ స్మైల్‌‌‌‌తో కట్టి పడేస్తోన్న రష్మిక

హీరోయిన్అంటే  గ్లామరస్‌‌‌‌గానే  కనిపించాలనుకునేవారు ఒకప్పుడు. కానీ ఆ రోజులు పోయాయి. పాత్రకి తగ్గట్టు ఎలా మారినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే అలాంటి క్యారెక్టర్లు చేయడానికి హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ ‘పుష్ప’ సినిమాలో మేకప్‌‌‌‌ లేకుండా, అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది రష్మిక.  ఆ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడొక హిందీ సినిమాలో కూడా డీ గ్లామరస్‌‌‌‌గా కనిపించబోతోంది. సౌత్‌లో టాప్ హీరోలతో నటిస్తూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది రష్మిక. ఆమె మొదటి హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇదో స్పై థ్రిల్లర్. ఓ డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్యారెక్టర్‌‌లో కనిపించనుంది. ఇందులో నటిస్తూనే ‘గుడ్ బై’ సినిమాకి ఓకే చెప్పింది రష్మిక. అయితే మొదటి సినిమా కంటే ముందే రెండో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. వికాస్ బెహల్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను వదిలారు. ఇందులో అస్సలు మేకప్‌‌‌‌ లేకుండా సింపుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఉంది రష్మిక. ఆమెకి తండ్రిగా నటించిన బిగ్‌‌‌‌బీ గాలిపటాన్ని ఎగరేస్తుంటే.. వెనక నిలబడి ఆయనకి సాయం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇది రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కమర్షియల్ సినిమా కాదు. ఓ తండ్రికీ, కూతురికీ మధ్య జరిగే ఎమోషనల్‌‌‌‌ స్టోరీ. ఫ్యూనరల్ చుట్టూ తిరుగు తుంది. అందుకే సన్నివేశాలు, పాత్రలు అన్నీ నేచురల్‌‌‌‌గానే ఉంటాయట. రష్మిక ఇంత సహజంగా కనిపించడానికి కారణమదే. అయితేనేం.. తన బ్యూటిఫుల్ స్మైల్‌‌‌‌తో కట్టి పడేస్తోంది. అసలైన అందం మేకప్‌‌‌‌లో ఉండదని మరోసారి ప్రూవ్ చేసింది. ‘పుష్ప 2’లో కూడా ఆమె శ్రీవల్లిగా మరోసారి డీ గ్లామరస్ రోల్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇక బాలీవుడ్‌లో ‘యానిమల్’, కోలీవుడ్‌లో ‘వారిసు’ సినిమాల్లోనూ నటిస్తోంది రష్మిక.