
ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తోంది రష్మిక మందన్నా. ఆమె నటించిన రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా పాల్గొంటుంది రష్మిక. ముందుగా ఆయుష్మాన్ ఖురానాతో నటించిన హారర్ కామెడీ ‘థామా’ అక్టోబర్ 21న రిలీజ్ అవుతోంది.
ఇందులో రష్మిక బేతాళ ప్రపంచానికి చెందిన సుందరిగా కనిపించనుంది. మొన్నటి వరకు ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రష్మిక.. తాజాగా ఆమె లీడ్‌గా నటించిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించి ప్రచారంలో బిజీ అవుతోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. రష్మికతో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో రష్మికకు జంటగా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.
Kicking off the promotions with some Fun & Games ❤️
— Geetha Arts (@GeethaArts) October 18, 2025
A cracker of an interview is dropping soon 🔥
Meanwhile, GUESS THE HOST 🧐🎤#TheGirlfriend in cinemas on November 7th ✨@iamRashmika @Dheekshiths @23_rahulr @HeshamAWMusic @GeethaArts #AlluAravind #VidyaKoppineedi… pic.twitter.com/0utdOtexJN
మరోవైపు వీటితోపాటు రష్మిక లైనప్‌లో మరో నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కేవలం షూటింగ్స్‌కే పరిమితం కాకుండా ప్రమోషన్స్‌కు కూడా సహకరించడం గొప్ప విషయమని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Thamma promotions day 1 - 🤍🌹🥰 pic.twitter.com/iyqJ1vvPbI
— Rashmika Mandanna (@iamRashmika) October 15, 2025