అభిమానికి వీడియో కాల్ చేసిన రష్మిక.. మనోడు ప్రపోజ్ కూడా చేశాడు.

అభిమానికి వీడియో కాల్ చేసిన రష్మిక.. మనోడు ప్రపోజ్ కూడా చేశాడు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తన అభిమానికి వీడియో కాల్ చేశారు. ఆ అభిమానికి రష్మిక అంటే చాలా పిచ్చి. 2016 నుండి ఆమెను ఫాలో అవుతున్నాడు ఆ ఫ్యాన్స్. రష్మిక సినిమాలు చూడటం, ఆమెను ఫాలో అవడం, ఆమె సినిమాలపై తన అభిప్రాయాన్ని చెప్పడం చేస్తూ ఉంటాడు. దాదాపు 7 సంవత్సరాల తరువాత తన అభిమాన నటితో వీడియో కాల్ లో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 

ఇంతకీ ఆ అభిమాని మరెవరో కాదు ప్రమోద్‌ భాస్కర్‌. ఆయన ఇటీవల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షోకి కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఇందులో భాగంగా తన మనసులో మాటను హోస్ట్ అమితాబ్ తో చెప్పుకున్నాడు. తనకు రష్మిక అంటే చాలా ఇష్టం అని, తన సినిమాలన్నింటినీ తప్పకుండా చుస్తానని, సోషల్ మీడియాలో ఆమెకు ప్రపోజ్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే అమితాబ్ రష్మికకు వీడియో కాల్ చేసి ప్రమోద్‌ తో మాట్లాడించారు. తన అభిమాన నటి తనతో వీడియో మాట్లాడటంతో సంతోషంలో తేలిపోయాడు ప్రమోద్‌. మీరంటే చాలా ఇష్టం అని చెప్పిన ప్రమోద్‌.. మిమ్మిల్ని ఒకసారి పర్సనల్ గా కలవాలని ఉందని అడిగాడు. దానికి రష్మిక కూడా సరే తప్పకుండ అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప2 సినిమాలో చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ  పాన్ ఇండియా మూవీ.. 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.