నా దృష్టిలో గీతాంజలి అంటే..! యానిమల్ పాత్రపై స్పందించిన రష్మిక

నా దృష్టిలో గీతాంజలి అంటే..! యానిమల్ పాత్రపై స్పందించిన రష్మిక

యానిమల్(Animal) సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) గీతాంజలి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన రష్మిక.. యానిమల్ సినిమాలో రణ్బీర్(Ranbir) భార్య కుటుంబపరమైన పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ఆడియన్స్ నుండి మంచి మార్కులు పడ్డాయి. దేంతో యానిమల్ సినిమాలో ఆమెకు వస్తున్న పాజిటివ్ కామెంట్స్ గురించి చెప్తూ సోషల్ మీడియా విదేకగా స్పందించారు. 

యానిమల్ సినిమాలో గీతాంజలి చూపించిన ప్రేమ స్వచ్చమైనది, నిజమైనది, దృఢమైనది కూడా. ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. గీతాంజలి కుటుంబాన్ని ఒక్క చోట చేర్చే శక్తి. హింసలు, బాధలు నిండిన కుటుంబలో గీతాంజలి శాంతి, నమ్మకాన్ని, ప్రశాంతనను తెస్తుంది. ఆమె తన భర్త, పిల్లల, కుటుంబాన్ని సురక్షితంగా ఉంచమని దేవుడిని ప్రార్థిస్తుంది. నా దృష్టిలో గీతాంజలి చాలా అందమైన అమ్మాయి. మా యానిమల్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇలాగే ప్రతీ మూవీ కోసం కష్టపడతాను. . అంటూ ఎమోషనల్ ఎమోషనల్ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప2 లో యాక్ట్ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే మరో సినిమా చేస్తున్నారు రష్మిక. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. ఈ రెండు సినిమాలి రష్మికకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాయి అనేది చూడాలి.