
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ‘ఖుషి’ ఫేమ్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు సాయి రాజేష్ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నామని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు తెలియజేశారు.