
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మ్యారేజ్ చేసుకోబుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే (అక్టోబర్ 3న) వీరి నిశ్చితార్థం కూడా జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపించింది. అయితే, ఈ జంట మాత్రం ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారే తప్ప, తమ పెళ్లిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ తరుణంలోనే విజయ్-రష్మిక మూడు ముళ్లతో ఒక్కటవ్వనున్నారు, అనడానికి పలు సాక్ష్యాలు ఇపుడు వైరల్ గా మారాయి. అవే తమ ఇరువురు చేతికి ఉన్న ఉంగరాలు.
ఇటీవలే విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లారు. అక్కడ ఆయన విజయ్ చేతికి కొత్తగా కనిపించిన బంగారపు రింగ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా రష్మిక ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన ప్రసెంట్ బాలీవుడ్ మూవీ ‘థామా’లోని ‘నువ్వు నా సొంతమా’ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. అయితే, ఇక్కడ రష్మిక చేతికి వజ్రపు ఉంగరం కనిపించి నెటిజన్లకు దొరికిపోయింది.
ఈ క్రమంలోనే విజయ్- రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. వీరి పెళ్లి కన్ఫామ్ అంటూ సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వేలికి మెరుస్తున్న రింగ్, రష్మిక ఎడమ చేతికి ఉన్న రింగ్ ఫొటోస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి విజయ్, రష్మిక లేదా వారి కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. అతి త్వరలోనే ఈ జంట తమ అభిమానులందరికీ శుభవార్త చెప్పే అవకాశం ఉందంటున్నారు.
ALSO READ : గ్రాండ్గా ఎన్టీఆర్ బావమరిది, హీరో నితిన్ వివాహ వేడుక..
ఇదిలా ఉంటే.. 'ట్యాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్.. విజయ్తో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ కి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 1870 టైమ్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తెరకెక్కుతుంది.
నాలుగేళ్ల రహస్య ప్రేమాయణం:
విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా 'గీత గోవిందం' (2018) సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (2019)లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఏదో ఉందని సినీ విశ్లేషకులకులతో పాటు అభిమానుల్లో ఒక అంచనాకు వచ్చారు.
ముఖ్యంగా, ముంబైలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఈ జంట నివసిస్తున్నారనే వార్తలు, ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిన సందర్భాలు, జిమ్ సెషన్స్‌కు హాజరవడం.. వంటివి వారి ప్రేమాయణానికి మరింత బలం చేకూర్చాయి. చాలాసార్లు ఇద్దరూ తమ సంబంధాన్ని కేవలం 'మంచి స్నేహం'గా మాత్రమే పేర్కొన్నప్పటికీ, ఇరు కుటుంబాలు అంగీకరించి, గోప్యంగా నిశ్చితార్థం చేశారనే వార్త విజయ్-రష్మిక అభిమానులకు తీపి కబురుగా మారింది.