
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లి ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి (2025 అక్టోబర్10న) హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో బంధువులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహం గ్రాండ్‌గా జరిగింది. తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె అయిన లక్ష్మీ శివానితో కలిసి నితిన్ ఏడడుగులు వేశారు.
ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్లికి వచ్చిన అతిథులని దగ్గరుండి ఆహ్వానిస్తూ, తమ చేతుల మీదుగా వివాహం వైభవంగా జరిగేలా ముందుండి నడిపించారు.
A Justification Family Man.
— AndhraNTRFC (@AndhraNTRFC) October 11, 2025
Nithiin and Shivani 💑@tarak9999 #JrNTR #ManOfMassesNTR pic.twitter.com/P3KSQia34T
ఈ సందర్భంగా కొత్త దంపతులకు ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు. నితిన్ తన బావ ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలో హీరో రానా, కళ్యాణ్ రామ్, వెంకటేష్ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. నితిన్-శివానిలా ఎంగేజ్మెంట్ 2024 నవంబర్లో జరిగింది.
పెళ్లికూతురు శివాని ఫ్యామిలీ వివరాలు:
హీరో నార్నే నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తాళ్లూరి శివాని. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కూతురే శివాని. తాళ్లూరి కృష్ణప్రసాద్కు రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీతో తాళ్లూరి కృష్ణప్రసాద్ కుటుంబానికి దగ్గర బంధుత్వం ఉన్నట్లు సినీ, రాజకీయ వర్గాల సమాచారం. అలా, నార్నె నితిన్ భార్య శివానీ, హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుందని వినికిడి.
Also Read : హృతిక్ రోషన్ డిజిటల్ డెబ్యూ.. అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్..
ఇకపోతే, ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. జూనియర్ ఎన్టీఆర్‌కు బావ మరిదిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మ్యాడ్, ఆయ్ లాంటి చిత్రాలతో సూపర్ సక్సెస్ కొట్టి యూత్ కి దగ్గరయ్యాడు నితిన్.