
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ‘పుష్ప’తో సాలిడ్ హిట్ అందుకున్న ఆమె లిస్టులో వరుస సినిమాలు చేరుతున్నాయి. నిన్న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ స్పెషల్ అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక మరో రెండు క్రేజీ చిత్రాల్లో చాన్స్ కొట్టేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో రష్మిక నటిస్తున్నట్టు ప్రకటించారు. ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్‌తో పాటు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో కాశ్మీరీ ముస్లిం అమ్మాయి ఆఫ్రిన్ పాత్రలో రష్మిక కనిపించనుంది. యుద్ధంతో రాసిన ప్రేమ కథ.. అంటూ ఆ పోస్టర్‌పై రాసుండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న మూవీలోనూ రష్మికనే హీరోయిన్ అంటూ నిన్న అనౌన్స్ చేశారు. వంశీపైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది.