
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే రకమైన కమీషన్, గౌరవ వేతనం ఇవ్వాలని ఆలిండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫెడరేషన్ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు మాట్లా డారు. డీలర్లు చాలీచాలని కమీషన్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం దిగుమతి, హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కోరారు. డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి డిమాండ్ చేశారు.