డీలర్ల అభ్యున్నతి కోసం శ్రమిస్తా : నాయికోటి రాజు

డీలర్ల అభ్యున్నతి కోసం శ్రమిస్తా : నాయికోటి రాజు
  • రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు

సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర  రేషన్ డీలర్ల అభ్యున్నతి కోసం అనునిత్యం శ్రమిస్తానని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జిల్లా నూతన కమిటీ అభినందన సభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట జిల్లా ఎన్నికలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. జిల్లా, రాష్ట్రంలో రేషన్ డీలర్ల ఏక నాయకత్వం ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.

 రాష్ట్రంలో ఉన్న 17 వేల200 మంది రేషన్ డీలర్ కుటుంబాలను సమస్యల నుంచి కాపాడుకునే బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉందన్నారు. రేషన్ డీలర్లు అనుకొని పరిస్థితుల్లో మృతి చెందితే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ అమలయ్యే విధంగా చూడాలన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వంగరి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శబనా తబసం అజీజ్, జిల్లా కోశాధికారిగా జూలూరి నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా పాక రమేశ్, బొజ్జ నరేందర్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి, కుమార్, మురళి, దొమ్మాటి రవీందర్, పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.