సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.."రావణాసుర" టీజర్

 సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.."రావణాసుర" టీజర్

ధమాకా, వాల్తేరు వీరయ్య  సినిమాల హిట్టుతో సూపర్ కిక్కులో ఉన్న మాస్ మహారాజా రవితేజ..మరో హిట్టుపై కన్నేశాడు. త్వరలో "రావణాసుర" (Ravanasura) సినిమాతో వస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన  రావణాసుర ఆంథమ్‌.. ప్యార్‌లోన పాగల్ పాటలు జనాలకు నచ్చేశాయి. తాజాగా రావణాసుర మేకర్స్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

నిమిషం 7 సెకన్ల టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనను టార్గెట్ చేసిన వారిని హీరో రవితేజ వరుసగా అంతం చేసుకుంటూ వెళ్తుంటాడు. అతన్ని పట్టుకోవడానికి  జయరామ్ (మురళీ శర్మ) ఆధ్వర్యంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.  సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .... ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి.. అనే డైలాగ్ టీజర్లో హైలైట్గా నిలుస్తోంది. 

ఆసక్తి కలిగించే  యాక్షన్‌ సీన్స్తో టీజర్‌ అదిరిపోయింది. రవితేజ నటన నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నట్లు టీజర్‌ను చూస్తుంటే తెలుస్తుంది.  ఈ సినిమాలో సుశాంత్‌ ది కీలక రోల్ చేసిన్నట్లు సమాచారం. రవితేజ‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా న‌టిస్తున్నారు. అఅభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుందని తెలుస్తోంది.