రామ్ చరణ్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ కూతురు?

రామ్ చరణ్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ కూతురు?

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉప్పెన(Uppena) దర్శకుడు బుచ్చిబాబు(Buchhibabu) కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రూరల్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటున్నారు మేకర్స్. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కూతురుని తీసుకోనున్నారు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవడ్ బ్యూటీ రవీనా టాండన్. ఈమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈమె కూతురు రాషా థడానీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైంది. 

ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్ట్ ఓకే చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో రామ్ చరణ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందట. అంతేకాదు RC16 కి సంబంధించి రాషా థడానీ లుక్ టెస్ట్ క్కూడా చేశారట మేకర్స్. ఇందుకోసం ఈ మధ్యే హైదరాబాద్ కూడా వచ్చిందట ఈ చిన్నది. లుక్ టెస్ట్ కూడా మేకర్స్ కు బాగా నచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.