
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్‌కు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా జరుగుతుందంటూ పార్లమెంట్ సెషన్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత రవి కిషన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా యూపీ సర్కార్‌ను కోరారు. దీనికి స్పందించిన సీఎం యోగి ప్రభుత్వం రవి కిషన్‌కు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. అదనపు సెక్యూరిటీని కల్పించినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రవి కిషన్ థ్యాంక్స్ చెప్పారు. ‘యువతతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం నేను మాట్లాడా. నా జీవితం గురించి నేను ఆలోచించలేదు. దేశ భవిత కోసం నాపై తూటాలు దింపినా ఓర్చుకుంటా. నేను దేని గురించీ చింతించడం లేదు’ అని రవి కిషన్ పేర్కొన్నారు.