ఆయన సారథ్యంలో టీమిండియా స్థాయి పెరుగుతది

ఆయన సారథ్యంలో టీమిండియా స్థాయి పెరుగుతది

దుబాయ్‌‌‌‌: ప్లేయర్‌‌‌‌గా, కోచ్‌‌‌‌గా తనకున్న అనుభవం వల్ల టీమిండియా స్థాయిని పెంచే సత్తా రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌కు ఉందని మాజీ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి అన్నాడు. పదవీ కాలం ముగియడంతో రవిశాస్త్రి టీమిండియా బాధ్యతల నుంచి తప్పుకోగా.. ద్రవిడ్‌‌‌‌ ఆ స్థానంలోకి వచ్చాడు. టీమిండియాతో తన జర్నీపై మీడియాతో మాట్లాడిన శాస్త్రి.. రాహుల్‌‌‌‌పై నమ్మకముందన్నాడు. అంతేకాక త్వరలో కామెంటేటర్‌‌‌‌గా రీఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ‘ రాహుల్‌‌‌‌ చాలా గొప్ప ప్లేయర్‌‌‌‌. కోచ్‌‌‌‌గా కూడా ఇప్పటికే ఎంతో సాధించాడు. రాబోయే రెండేళ్లలో టీమ్‌‌‌‌ స్థాయిని మరింత పెంచుతాడని  నమ్మకముంది. నా హయాంలో ఐసీసీ ట్రోఫీ తప్ప అన్నీ సాధించాం. రాహుల్‌‌‌‌ దానిని కూడా సాధిస్తాడని అనుకుంటున్నా. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌‌‌‌తో జరగబోయే ఐదో టెస్టులో నన్ను కామెంటేటర్‌‌‌‌గా చూసే చాన్సుంది’అని శాస్త్రి పేర్కొన్నాడు. అంతేకాక తనతోపాటు జట్టును వీడుతున్న భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌(బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌), ఆర్‌‌‌‌. శ్రీధర్‌‌‌‌(ఫీల్డింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌)ను శాస్త్రి ప్రశంసించాడు. భరత్‌‌‌‌ను తాను గురువు అని పిలుస్తానని చెప్పిన శాస్త్రి..  శ్రీధర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌లోనే బెస్ట్‌‌‌‌ కోచ్‌‌‌‌ అన్నాడు. ఈ ఇద్దరూ జట్టుకు  అందించిన సేవలు వెలకట్టలేనివని శాస్త్రి కొనియాడాడు.

మరిన్ని వార్తలు