ర‌వితేజ బ‌ర్త్ డే గిఫ్ట్ వ‌చ్చేసింది

V6 Velugu Posted on Jan 26, 2022

శరత్ మండవ డైరెక్ష‌న్ లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్‌డ్యూటీ’ నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది.  రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. యాక్షన్‌తో కూడిన ఈ పోస్టర్‌లో రవితేజ దూకుడుగా కనిపిస్తున్నాడు. అతనిలో దాగిఉన్న వివిధ భావోద్వేగాలను కూడా చూపిస్తుంది. ఒక చోట తన భార్యతో కనిపిస్తే, మరొక చోట ఫ్యామిలీతో కనిపిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ అనేది అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్‌, రజిషా విజయన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న ఈ మూవీ విడుదల కానుంది.

 

Tagged BirthDay, poster, Ravi Teja, , rama rao duty

Latest Videos

Subscribe Now

More News