రివ్యూ: డిస్కోరాజా

రివ్యూ: డిస్కోరాజా

రివ్యూ: డిస్కోరాజా
రన్ టైమ్ : 2 గంటల 29 నిమిషాలు
నటీనటులు: రవితేజ, నభానటేష్, పాయల్ రాజ్ పుత్, బాబీ సింహా, సునీల్, సత్య, వెన్నెల కిషోర్, తాన్యా హోప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్: తమన్
మాటలు : అబ్బూరి రవి
నిర్మాత: రామ్ తాళ్లూరి
రచన,దర్శకత్వం: వి.ఐ ఆనంద్
రిలీజ్ డేట్: జనవరి 24,2020

కథేంటి?

లడఖ్ లో ట్రెక్కింగ్ చేస్తున్న ఓ యంగ్ టీమ్ కు మైనస్ 75 డిగ్రీస్ లో ఉన్న ఓ శవం (రవితేజ ది) దొరుకుతుంది. ఓ సీనియర్ సైంటిస్ట్ శవాలకు ప్రాణం తెప్పించే పరిశోధన చేస్తుంటాడు. ఈ బాడీ మీద ఆ ఎక్సిపెరిమెంట్ జరిపి ఆ బాడీకి ప్రాణం తెప్పిస్తాడు. ఓ వైపు వాసు (రవితేజ) తప్పిపోయాడని వాళ్ల ఫ్యామిలీ వెతుకుతుంటుంది. ప్రాణం వచ్చిన బాడీకి మాత్రం గతం గుర్తుకురాదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతడికి గతం గుర్తొస్తుంది. కానీ వాసు లాగా కాకుండా వేరే మెమోరీస్ అతడికి గుర్తొస్తాయి. ఇంతకీ అది ఎవరు? తనకు, వాసుకు సంబంధం ఏంటి అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

రవితేజకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. ఎప్పటిలాగానే ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. నభానటేష్ ఫస్టాఫ్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నంతలో బాగా చేసింది. పాయల్ రాజ్ పుత్ ఫర్వాలేదనిపిస్తుంది. మరో డాన్ పాత్రలో బాబీ సింహా రాణించాడు. తాన్యా హోప్ ది చిన్న రోల్. సునీల్ కు మంచి పాత్ర దక్కింది. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ పండించారు.

టెక్నికల్ వర్క్:

సినిమా టెక్నికల్ గా రిచ్ గా ఉంది. కార్తీక్ సినిమాటోగ్రపీ హైలైట్. తమన్ మ్యూజిక్ సినిమాకు ఎస్సెట్ గా మారింది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ములేపాడు తమన్. ఇక ఆర్ట్ వర్క్ సూపర్బ్. రెట్రో స్టైల్ క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర సక్సెస్ అయ్యాడు. నిర్మాత పెట్టిన డబ్బులు తెరమీద కనిపించాయి. అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘డిస్కోరాజా’’ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు కాస్త కొత్తదనం తగిలించినట్టనిపిస్తుంది. డైరెక్టర్ వి.ఐ ఆనంద్ అనుకున్న పాయింట్ కొత్తగానే ఉన్నా..దాన్ని పూర్తిగా ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడనే చెప్పాలి. సినిమా మొదలైన తీరు ఆకట్టుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి హై వస్తుంది. హీరోకి గతం గుర్తుకు వచ్చే ఎపిసోడ్ ను బాగా డిజైన్ చేశారు. అక్కడ మ్యూజిక్, యాక్షన్ సీన్ బాగా పండింది. అయితే తర్వాత మొదలైన సెకండాఫ్ మరీ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తో బోర్ కొట్టిస్తుంది. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న కథనం మరీ పేలవంగా తయారైంది. రవితేజ తన ఎనర్జీతో సేవ్ చేయాలని చూసినా.. మళ్లీ క్లైమాక్స్ కూడా అదే రకంగా సాగడంతో నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా రవితేజ మార్కు ఎంటర్ టైన్మెంట్ ,టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ కోసం ఓసారి ట్రై చేయవచ్చు. కానీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేసిన వాళ్లు డిజప్పాయింట్ అవుతారు.

బాటమ్ లైన్: డిస్క్ ఎర్రర్…

See Also: 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి

మైనర్ రేప్ పై.. అంతా తూచ్.. సినిమాకి వెళ్లిందటా..!

పెళ్లి కావడంలేదని 20 ఏళ్ల యువకుడు సూసైడ్