Raviteja, Harish Shankar: ఓవర్ చేయకురోయ్.. డైరెక్టర్ హరీష్కి రవితేజ క్యూట్ రిప్లయ్

Raviteja, Harish Shankar: ఓవర్ చేయకురోయ్.. డైరెక్టర్ హరీష్కి రవితేజ క్యూట్ రిప్లయ్

మాస్ మహారాజ్ రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కి క్యూట్ రిప్లై ఇచ్చారు. ఓవర్ చేయకురోయ్ అంటూ ఫన్నీ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం రవితేజ చేసిన ఈ రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రవితేజ ప్రస్తుతం డైరెక్టయిర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఇంటరెస్టింగ్ న్యూస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సాంగ్ షూటింగ్ కాశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. ఆ షూట్ లో రవితేజ ఫోటోను షేర్ చేస్తూ.. ప్రపంచంలో అందరికీ వయసైపోతుంది ఒక్క అన్నయ్యకు(రవితేజ) తప్పా.. అంటూ  రాసుకొచ్చాడు. దానికి ఫన్నీ గా రియాక్ట్ అయినా రవితేజ.. ఓవర్ చేయకూరోయ్.. నీ దిష్టే తగిలేట్టుంది.. అని రిప్లయ్ ఇచ్చారు. దాంతో ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.