ఈ ఏడాది ఫుల్‌‌‌‌ కిక్

V6 Velugu Posted on Jan 27, 2022

వరుస సినిమాలతో ఈ ఏడాది థియేటర్స్‌‌‌‌కు రాబోతు న్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడి,  రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర,  టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు. నిన్న రవితేజ పుట్టినరోజు కావడంతో విషెస్‌‌‌‌ తెలియజేస్తూ ఆ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్స్‌‌‌‌ను విడుదల చేశారు. రమేష్‌‌‌‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ సినిమా నుంచి ‘ఫుల్‌‌‌‌ కిక్’ అనే సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ‘నీ లిప్‌‌‌‌ లోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్.. ఓ నిప్పులాగ నన్ను తాకి పెంచెను పల్స్’ అంటూ శ్రీమణి రాసిన ఈ పాటను.. రవితేజ, డింపుల్‌‌‌‌ జంటపై తీశారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామారావు ఆన్‌‌‌‌ డ్యూటీ’ నుంచి స్పెషల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌లో కనిపిస్తున్నాడు రవితేజ.  దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.  త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధమాకా’ ఆల్రెడీ సెట్స్‌‌ పై ఉంది.  సుధీర్ వర్మ తీస్తున్న ‘రావణాసుర’ టీమ్స్ కూడా పోస్టర్స్‌‌‌‌తో రవితేజకు బర్త్ డే విషెస్ అందించారు.
 

Tagged Ravi Teja, KhiladiMovie, Full Kick, Rama Rao on Duty, Dhamaka, Ravanasura and Tiger Nageswara Rao

Latest Videos

Subscribe Now

More News