యాక్షన్ థ్రిల్లర్గా ‘రావణాసుర’

యాక్షన్ థ్రిల్లర్గా ‘రావణాసుర’

ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్​లు అందుకున్న రవితేజ.. త్వరలో ‘రావణాసుర’ అనే యాక్షన్‌‌‌‌ సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ టీమ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌తో కలిసి అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్. గురువారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు.

ఇందులో రవితేజ పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ లాయర్‌‌‌‌గానే కాక మరో స్టైలిష్‌‌‌‌ గెటప్‌‌‌‌లోనూ కనిపించాడు. రెండు గెటప్స్‌‌‌‌లోనూ సిగార్ తాగుతూ కనిపించాడు. ఓ అజ్ఞాత వ్యక్తి  అమ్మాయిలను చంపడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌‌‌తో కట్ చేసిన ఈ గ్లింప్స్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అంతేకాకుండా రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌లో కనిపిస్తాడని అర్థమవుతోంది. అనూ ఎమ్మాన్యుయేల్‌‌‌‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌‌‌‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, సుశాంత్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. రావు రమేశ్‌‌‌‌, మురళీ శర్మ, సంపత్‌‌‌‌ రాజ్‌‌‌‌, నితిన్‌‌‌‌ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్‌‌‌‌ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్‌‌‌‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌‌‌‌ 7న సినిమా విడుదల కానుంది.