గన్స్ తో రవితేజ దివాళీ.. ఈగల్ పోస్టర్ ఇట్రస్టింగ్

గన్స్ తో రవితేజ దివాళీ.. ఈగల్ పోస్టర్ ఇట్రస్టింగ్

మాస్ హీరో రవితేజ లేటెస్ట్ మూవీ.. ఈగల్. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్.. ఇంట్రస్టింగ్ గా ఉంది. గన్ తో విలన్స్ పై ఫైరింగ్ చేస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. శత్రువులపై దండయాత్ర అన్నట్లు ఉంది. పోస్టర్ మేకింగ్ డిఫరెంట్ గా ఉండటంతో.. మూవీపై అంచనాలు పెరిగాయి. మాస్ యూత్ టార్గెట్ గా మూవీ ఉంటుందని పోస్టర్ చూస్తే స్పష్టం అవుతుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఈసారి టపాసులు సంక్రాంతికి కూడా పేలుద్దాం అంటూ విషెస్ చెప్పారు హీరో.

ఈగల్ మూవీ 2024, జనవరి 13వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది మాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. హైప్ వచ్చినా అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ స్పందన లేదు. ఈ క్రమంలోనే ఈగల్ మూవీపై మరింత శ్రద్ధ పెట్టారు దర్శక, నిర్మాతలు. 

ఈగల్ మూవీకి ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. దీపావళికి రిలీజ్ అయిన ఈగల్ పోస్టర్ మాత్రం.. ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో ధియేటర్లలో సందడి చేయనుంది మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి టాక్ తెచ్చుకుంది.