మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడి పేరుతో రావడం, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ బలంగా ఉండటం మూవీపై అంచనాలు పెంచేసాయి. ఈ క్రమంలోనే ఇరుముడి రిలీజ్ డేట్ ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆగస్టు 21న ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ‘‘ఈ వర్షాకాలంలో, థియేటర్లలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాల సందడి ఇరుముడి. ఈ హర్ట్ టచింగ్ మూవీ ఆగస్టు 21, 2026 నుండి థియేటర్లలోకి రాబోతుంది’’ అని మైత్రి మూవీస్ ట్వీట్ చేసింది.
This monsoon, it is a spell of heartwarming emotions in theatres ❤️#IRUMUDI / #IRUMUDIKATTU in cinemas from August 21st, 2026 ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2026
'The Heart of #Irumudi' Glimpse :
Telugu
▶️ https://t.co/VhUJ4Sr5CL
Tamil
▶️ https://t.co/SEgGK2YZXe
Starring MASS MAHARAJA @RaviTeja_offl
A… pic.twitter.com/dCz4mzeEGl
నాని vs రవితేజ..
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ కూడా ఆగస్టు 21నే విడుదలకు షెడ్యూల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడం మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదలను ఆగస్టు 21కి వాయిదా వేశారు.
►ALSO READ | Balan Trailer: మరో థ్రిల్లింగ్ కథతో ‘మంజుమ్మేల్ బాయ్స్’ డైరెక్టర్.. ఆసక్తిగా ‘బాలన్: ది బాయ్’ ట్రైలర్
అయితే, ఇటీవల సినిమా షూటింగ్కు సంబంధించిన పలు వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని, నిర్మాణ పనులు ఆశించిన వేగంతో జరగడం లేదని ప్రచారం జరిగింది. దీంతో ఆగస్టు 21న కూడా సినిమా విడుదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ అదే తేదీని లాక్ చేసుకోవడంతో, ‘ది ప్యారడైజ్’ విడుదలపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవేళ నాని సినిమా అనుకున్న సమయానికి విడుదలైతే, బాక్సాఫీస్ వద్ద నాని – రవితేజ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరి ‘ది ప్యారడైజ్’ టీమ్ విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
I don’t want to rush.
— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026
I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3
