అమ్మతోడు నిజం.. రవితేజ రావణాసుర సూపర్ హిట్..

అమ్మతోడు నిజం.. రవితేజ రావణాసుర సూపర్ హిట్..

రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర మూవీ గుర్తుంది కదా.. వచ్చినట్లు గుర్తుంది కానీ.. చూసినట్లు లేదు అని సినీ అభిమానుల టాక్. ధియేటర్లలోకి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన మూవీ అది. మొన్నటికి మొన్న ఏప్రిల్ 7వ తేదీన ధియేటర్లలో విడులైన ఈ సినిమా.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు జనం. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే.. ఇండియా టాప్ 2లోకి వచ్చేసింది. వీకెండ్ కూడా కావటం.. సమ్మర్ హాలిడేస్..  అందులోనూ రవితేజ కొత్త సినిమా కావటంతో ఇళ్లల్లోనే సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. 

50 కోట్ల రూపాయల బడ్జెట్ తో.. రావణాసులు సినిమా క్రైం అండ్ యాక్షన్ ట్విస్టులతో తెరకెక్కింది. ధియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేశారు. ఊహించని విధంగా ఆన్ లైన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెగ చూసేస్తున్నారు జనం. మరో 24 గంటల్లో ఇండియా నెంబర్ వన్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు ఫ్యాన్స్. ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు, సిరీస్ లు లేకపోవటంతో మరో వారం రోజులు  రావణాసుల మూవీకి మంచి వ్యూవర్ షిప్ దక్కే అవకాశాలు లేకపోలేదు. మరో విశేషం ఏంటంటే.. తమిళ భాషలోనూ రావణాసుర మూవీ అందుబాటులో ఉండటంతో.. మంచి వ్యూవర్ షిప్ వస్తుంది.

సుశాంత్ కీలక పాత్ర పోషించగా.. రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. రవితేజ ఓ పాటను కూడా పాడటం విశేషం.శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.  అభిషేక్ పిక్చర్స్- RT టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామ,  రవితేజ.. ఈ సినిమాను చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.