యాదగిరిగుట్ట టెంపుల్ ఇన్‌చార్జి ఈవోగా రవినాయక్

యాదగిరిగుట్ట టెంపుల్ ఇన్‌చార్జి ఈవోగా రవినాయక్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా ఐఏఎస్ అధికారి రవినాయక్ నియమితులయ్యారు.  ప్రస్తుతం రవినాయక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా పని చేస్తుండగా.. ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  

గురువారం ఆయన ఆలయ ఇన్‌చార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. దేవస్థాన ప్రస్తుత ఈవో వెంకటరావు వ్యక్తిగత పనుల మీద నెల రోజుల పాటు సెలవు పెట్టగా.. ఆయన ప్లేస్ లో తాత్కాలిక ఈవోగా రవినాయక్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రవినాయక్ యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన అనుభవం ఉండడంతో..  ఆయనకు ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.