రవితేజ ‘డిస్కోరాజా’ డేట్ మారింది

V6 Velugu Posted on Nov 08, 2019

రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’. ఈ సినిమాను మొదట డిసెంబర్ 20, 2019న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందట. అందుకే సినిమాను మొదట అనుకున్న డిసెంబర్ 20న కాకుండా.. రిపబ్లిక్ డే మరియు రవితేజ పుట్టిన రోజును దృష్టిలో పెట్టుకొని జనవరి 24, 2020న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వీఐ ఆనంద్ తెలిపారు. అభిమానుల కోసం డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది.

Tagged Republic Day, Nabha Natesh, Raviteja, payal rajput, VI Anand, Ram Talluri

Latest Videos

Subscribe Now

More News