దొరక్కుండా మర్డర్ చేయటం ఆర్ట్.. రావణాసుర ట్రైలర్ రివ్యూ

దొరక్కుండా మర్డర్ చేయటం ఆర్ట్.. రావణాసుర ట్రైలర్ రివ్యూ

రవితేజ సినిమా అంటే ఎలా ఉంటుంది.. మాస్ మాస్ గా ఉంటుంది.. అందుకే మాస్ మహారాజా అంటారు.. వాల్తేర్ వీరయ్య తర్వాత వస్తున్న రావణాసుర మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంది. రవితేజ మార్క్ కామెడీతోపాటు క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది.

ఇక డైలాగ్‌ విషయానికి వస్తే..." లైఫ్ లో వయలన్స్ ఎక్కువై.. రొమాన్స్ లేకుండా పోయిందీ.. వచ్చేటప్పుడు బయటకు నుంచి డోర్ కొట్టాలి..  సరసాలు ఆడేటప్పుడు లోపలి నుంచి  డోర్ లాక్ చేసుకోవాలండీ..  వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివి క్రిమినల్...  " లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

 ఈ మూవీలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్,  పూజిత పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. సుశాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఏప్రిల్ 7న  రావణాసుర  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.