
ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న రవితేజ.. త్వరలో ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 6న ఉదయం 10.08 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సుశాంత్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది