
పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్తగా నిర్మించిన లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి పద్మమ్మ జ్ఞాపకార్థంగా ఆలయానికి శఠగోపం, స్థాలీ, ఉత్తరేణి, అరివేణి పాత్ర, గంట మొత్తం 50 తులాల వెండి వస్తువులను వితరణ చేశారు. అమ్మవారి ప్రతిష్ఠ కోసం కష్టపడిన కమిటీ సభ్యులను అభినందించి సన్మానించారు.
అనంతరం కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డికి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, టౌన్ అధ్యక్షుడు వనం రాములు, దిలీప్ రెడ్డి, ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డె ఈశ్వర్, అర్చకులు గోవర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.