ఐపీఓకు రేజన్ సోలార్.. 1,500 కోట్లను సేకరించడానికి సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌

ఐపీఓకు రేజన్ సోలార్.. 1,500 కోట్లను సేకరించడానికి సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌

న్యూఢిల్లీ: గుజరాత్‌‌‌‌కు చెందిన రేజన్ సోలార్​ ఐపీఓద్వారా రూ. 1,500 కోట్లను సేకరించడానికి  సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌ను అందజేసింది. ఈ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ఉండదు. మొత్తం నిధులను ఫ్రెష్​ఇష్యూతోనే సమీకరిస్తారు.  ప్రీ- ఐపిఓ రౌండ్‌‌‌‌లో కంపెనీ దాదాపు రూ. 300 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రీ- ఐపిఓ రౌండ్ జరిగితే, తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.

ఈ కొత్త ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,265 కోట్ల ఆదాయాన్ని  రేజన్​ ఎనర్జీలో పెట్టుబడి పెట్టడానికి, 3.5 గిగావాట్ల  సామర్థ్యంతో తయారీ సౌకర్యాన్ని స్థాపించడానికి, సూరత్‌‌‌‌లో టన్నెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంటాక్ట్ టెక్నాలజీని ఉపయోగించి సోలార్​సెల్స్​ను ఉత్పత్తి చేయడానికి,  సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. 2017లో కార్యకలాపాలు ప్రారంభించిన రేజన్​ సోలార్, మార్చి 31, 2025 నాటికి 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలోని సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్ల  టాప్ 10 తయారీదారులలో ఒకటిగా ఎదిగింది.