హైదరాబాద్లో ఆర్బీ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్

హైదరాబాద్లో ఆర్బీ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: బైకులను అద్దెకు ఇచ్చే రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ అనుబంధ సంస్థ మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా కలిసి ఆర్ బీ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్​ను  హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించాయి. హాస్టెన్ గో కార్టింగ్ జోన్‌‌‌‌లో నిర్వహించిన ప్రొఫెషనల్ ట్రైనింగ్ వర్క్‌‌‌‌షాప్ లో 120 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.  మోటార్ సైకిల్ నడపడాన్ని సాహసం, స్వయంప్రతిపత్తికి చిహ్నంగా స్వీకరించేలా మహిళలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. శిక్షణ సమయంలో వారికి భద్రతా పరికరాలు అందించారు.  ప్రాక్టీస్ సెషన్ల కోసం వివిధ రకాల మోటార్ సైకిళ్లను ఇచ్చారు. డెలివరీ,  రవాణా రంగాలలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని రాయల్​ బ్రదర్స్​ తెలిపింది.