
బ్యాంకులు క్యాపిటల్ను పెంచుకోవాలి
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ లాక్డౌన్ను ఎత్తేయడం వల్ల ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్అన్నారు. కరోనాను అరికట్టిన తరువాత మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గవర్నమెంటు నుంచి మరింత సాయం ఆశించకుండా సొంతంగా ఎదిగి సాధారణ స్థితికి రావాలని ఫైనాన్షియల్ సెక్టార్ కు ఆయన సూచించారు. ఏడో ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకానమిక్స్ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ..ఆర్బీఐ కాలానుగుణంగా తీసుకున్న చర్యల వల్ల బ్యాంకులు కరోనా వల్ల ఎక్కువ నష్టపోలేదని అన్నారు. అయితే ఇక నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం సాధ్యంకాదని, కరోనా కేసులను బట్టి పరిస్థితులు మారతాయని అన్నారు. బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముందుజాగ్రత్తగా తగినంత క్యాపిటల్ను రెడీగా ఉంచుకోవాలన్నారు. దీనివల్ల క్రెడిట్ ఫ్లోలకు ఇబ్బంది ఉండదు. కరోనా వల్ల బ్యాంకుల మొండిబాకీలు పెరిగి క్యాపిటల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో సమర్థంగా వ్యవహరిస్తే ఫైనాన్షియల్ సిస్టమ్ త్వరగా కోలుకుంటుంది. ప్రస్తుతం సమస్యల నుంచి కోలుకునే శక్తి మన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సిస్టమ్ కు ఉంది.
For More News..