సీఆర్​ఆర్​, ఎస్​ఎల్​ఆర్​లో నో రిలీఫ్

సీఆర్​ఆర్​, ఎస్​ఎల్​ఆర్​లో నో రిలీఫ్
  • సీఆర్​ఆర్​, ఎస్​ఎల్​ఆర్​లో నో రిలీఫ్
  • హెచ్​డీఎఫ్​సీ మెర్జర్​పై ఆర్​బీఐ

ముంబై : క్యాష్​ రిజర్వ్​ రేషియో (సీఆర్​ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్​ఎల్​ఆర్) ల విషయంలో రిలీఫ్​ ఇవ్వడం కుదరదని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకి రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) స్పష్టం చేసింది. పేరెంట్​ కంపెనీ హెచ్​డీఎఫ్​సీతో  మెర్జర్​కు ముందు కొన్ని మినహాయింపులు కావాలని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఆర్​బీఐని కోరింది. కాకపోతే  ప్రయారిటీ సెక్టార్​ లెండింగ్​లో మాత్రం కొంత రిలీఫ్​ ఇవ్వడానికి ఆర్​బీఐ సానుకూలత వ్యక్తం చేసినట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు రెగ్యుటేటరీ ఫైలింగ్స్​లో  వెల్లడించింది.

దేశ కార్పొరేట్​ చరిత్రలోనే అతి పెద్ద మెర్జర్ ​హెచ్​డీఎఫ్​సీ–హెచ్​డీఎఫ్​సీ  బ్యాంకులదే కానుంది. ఈ డీల్​ విలువ 40 బిలియన్​ డాలర్లు. మెర్జర్​ ప్రపోజల్​ను కిందటి ఏడాది ఏప్రిల్​ నెలలోనే ప్రకటించారు. అవసరమైన రెగ్యులేటరీ అప్రూవల్స్​ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని అంశాలలో క్లారిటీ కోసం ఆర్​బీఐని కోరామని, ఇందులో కొన్నింటికి ఇప్పటికే బదులు వచ్చిందని, మరి కొన్నింటికి జవాబు రావల్సి ఉందని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు పేర్కొంది. మెర్జర్​ ఎఫెక్టివ్​ డేట్​ నుంచే సీఆర్​ఆర్, ఎస్​ఎల్​ఆర్​, లిక్విడిటీ కవరేజ్​ రేషియో (ఎల్​సీఆర్​) రూల్స్​ను హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు పాటించాలని ఆర్​బీఐ సూచించింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ సాధ్యం కాదని బ్యాంకుకు ఆర్​బీఐ తెలిపింది.

మెర్జర్​ ఎఫెక్టివ్​ డేట్ ​కంటే ముందుగా సబ్సిడరీ కంపెనీలయిన హెచ్​డీఎఫ్​సీ ​ లైఫ్ ​ ఇన్సూరెన్స్​ కంపెనీ, హెచ్​డీఎఫ్​సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్​ కంపెనీలలో వాటాను 50 శాతానికి మించి పెంచుకునేందుకు మాత్రం హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులకు ఆర్​బీఐ నుంచి అనుమతి దొరికింది. ఈ ఏడాది జులై నాటికి మెర్జర్​ ప్రక్రియ పూర్తి కావచ్చనే ఆశాభావాన్ని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కిందటి వారంలో జరిగిన ఎనలిస్టుల కాన్ఫరెన్స్​ కాల్​లో వ్యక్తం చేసింది.