పీఎంసీ బ్యాంక్‌‌ కస్టమర్లకు ఊరట

పీఎంసీ బ్యాంక్‌‌ కస్టమర్లకు ఊరట

ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(పీఎంసీ) కస్టమర్లకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఊరటనిచ్చింది. ఒక్కో అకౌంట్ నుంచి విత్‌‌‌‌డ్రా చేసుకునే లిమిట్‌‌‌‌ను వెయ్యి రూపాయల నుంచి రూ.10వేలకు పెంచింది. దీంతో బ్యాంక్‌‌‌‌లోని 60 శాతం డిపాజిటర్లు తమ మొత్తం బ్యాలెన్స్‌‌‌‌లను విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం కలుగుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చెప్పింది.  ఈ లిమిట్‌‌‌‌ పెంపుతో, డిపాజిటర్లలో ఉన్న ఆందోళనను కాస్త తగ్గించవచ్చని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ భావిస్తోంది. పీఎంసీ బ్యాంక్‌‌‌‌ పొజిషన్‌‌‌‌ను, దానికి సంబంధించిన పరిస్థితులను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పూర్తిగా సమీక్షిస్తోంది. బ్యాంక్‌‌‌‌ డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడే మేరకే తదుపరి చర్యలను తీసుకుంటామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చెప్పింది. డిపాజిటర్ల ప్రయోజనాల మేరకే అంతకుముందు ఆదేశాలను కూడా పున:సమీక్షించి, విత్‌‌‌‌డ్రా లిమిటెడ్‌‌‌‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. గురువారం జారీ చేసిన ఆదేశాలతో డిపాజిటర్లు తమ మొత్తం బ్యాలెన్స్ నుంచి రూ.10వేలకు మించి విత్‌‌‌‌డ్రా చేసుకోవడానికి వీలుండదు. ఆరు నెలల వరకు డిపాజిటర్లకు ఈ నియమం వర్తిస్తుంది. ఇతర నియమ, నిబంధనలను మాత్రం అలానే కొనసాగుతాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తెలిపింది. పీఎంసీ బ్యాంక్‌‌‌‌ ఎలాంటి కొత్త రుణాలను జారీ చేయకుండా, డిపాజిట్లను తీసుకోకుండా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అకౌంటింగ్‌‌‌‌లో లోపాలు జరిగాయని గుర్తించిన ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, పీఎంసీ బ్యాంక్‌‌‌‌పై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంక్ మొండి బకాయిలు కూడా భారీగా పెరిగాయి. అలాగే రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌసింగ్ డెవలప్‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్‌‌‌‌డీఐఎల్)కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో ఇది ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కనుసన్నల్లోకి వెళ్లింది.

కస్టమర్లు పోలీసు కంప్లయింట్…

పీఎంసీ బ్యాంక్‌‌‌‌కు చెందిన పలువురు అకౌంట్ హోల్డర్స్‌‌‌‌ బ్యాంక్ ఛైర్మన్, డైరెక్టర్లపై పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. కస్టమర్లకు చెందిన ఫండ్స్‌‌‌‌ను దుర్వినియోగపరిచారని ఆరోపించారు. సెంట్రల్ ముంబైలోని సియోన్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో తమ ఫిర్యాదును దాఖలు చేశారు.  పీఎంసీ బ్యాంక్ 35 ఏళ్ల కిందటిది. మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్నాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌‌‌‌లలో బ్యాంక్ కార్యకలాపాలను సాగిస్తుంది. 137 బ్రాంచ్‌‌‌‌లున్నాయి. దేశంలో టాప్ 10 కో–ఆపరేటివ్ బ్యాంక్‌‌‌‌లలో ఒకటిగా ఉంది.

పీఎంసీ బ్యాంక్‌‌ ఎండీపై వేటు…

పీఎంసీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) జాయ్ థామస్‌‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్‌‌‌‌బీఐ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌‌ నియంత్రణ ఆర్‌‌‌‌బీఐ అధికారులు చేతిల్లోకి వెళ్లిన తర్వాత, ఎండీపై వేటు పడింది. బుధవారం నుంచే ఈ సస్సెన్షన్ అమల్లోకి వస్తుందని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. బ్యాంక్ ప్రస్తుతం జేబీ భోరియా చేతిలో ఉంది. ఆయన్ను ఆర్‌‌‌‌బీఐ అపాయింట్ చేసింది. భోరియా బ్యాంక్ పుస్తకాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోనున్నారు. తదుపరి ఆదేశాల్లో ఈ తనిఖీల్లో బయటపడే ఫలితాలుంటాయి. బ్యాంక్‌‌ త్వరలో జరుపనున్న వార్షిక జనరల్ మీటింగ్ కూడా వాయిదా పడింది.