టెన్త్​తో ఆర్బీఐ జాబ్​.. జీతం నెలకు రూ. 26,500

టెన్త్​తో ఆర్బీఐ జాబ్​.. జీతం నెలకు రూ. 26,500

గవర్నమెంట్​ జాబ్​ సాధించడమే టార్గెట్​గా పెట్టుకున్న యువతకు ఆర్బీఐ గుడ్​న్యూస్​ తెచ్చింది. టెన్త్ అర్హత​తోనే సెంట్రల్​ కొలువు కొట్టే చాన్స్​ కల్పించింది. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) దేశవ్యాప్తంగా ఆఫీస్​ అటెండెంట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

ఆర్బీఐకి దేశంలో హైదరాబాద్​, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్​, చెన్నై సహా మొత్తం 17 సిటీల్లో రీజినల్​ ఆఫీసులు ఉన్నాయి. ఆయా ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్​ అటెండెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. ఆలిండియా లెవెల్​ ఆన్​లైన్​ ఎగ్జామ్​, రీజినల్​ ఆఫీస్​ పరిధిలోని లోకల్​ లాంగ్వేజ్​పై​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి బేసిక్​ పే రూ. 10,940 ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని రూ.26,508 వరకు వస్తుంది.

హైదరాబాద్​ రీజినల్​ ఆఫీస్​ పరిధి(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్​)లో 57(జనరల్​–24, ఈడబ్ల్యూఎస్​–5, ఓబీసీ–15, ఎస్టీ–5, ఎస్సీ–8) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  లోకల్​ లాంగ్వేజ్​ తెలుగు కాబట్టి అభ్యర్థులకు లాంగ్వేజ్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ తెలుగుపై ఉంటుంది.

అర్హత: టెన్త్​ ఉత్తీర్ణత. 1 ఫిబ్రవరి 2021 నాటికి అండర్​ గ్రాడ్యుయేట్​గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

వయసు: 1 ఫిబ్రవరి 2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంట్రీ లెవెల్​ ఆన్​లైన్​ టెస్ట్​, లాంగ్వేజ్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్​ టెస్ట్​ ప్యాటర్న్​

ఆన్​లైన్​ టెస్ట్​ ఇంగ్లిష్​, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఎగ్జామ్​ డ్యురేషన్​ 90 నిమిషాలు. మొత్తం మార్కులు 120.  ప్రతి తప్పు ఆన్సర్​కు 1/4 మార్కు కోత విధిస్తారు. ఆన్​లైన్​ టెస్టులో ఎంపికైన అభ్యర్థులకు లాంగ్వేజ్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​(ఎల్​పీటీ)ఉంటుంది. ఆన్​లైన్​ టెస్ట్​లో మెరిట్​, ఎల్​పీటీ క్వాలిఫై, మెడికల్​ ఫిట్​నెస్​, సర్టిఫికెట్​ వెరిఫికేషన్​, బయోమెట్రిక్​ డేటా/ఐడెంటిటీ వెరిఫికేషన్​ ద్వారా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

రీజనింగ్​

అన్ని సబ్జెక్టులతో పోలిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్​ చేయగలిగిన సబ్జెక్ట్​ రీజనింగ్​. ఇందులో ఒక టాపిక్​కు ఇంకొక టాపిక్​కు దాదాపుగా లింక్​ ఉండదు. ఒక్కో చాప్టర్​లోని కాన్సెప్ట్​లను పూర్తి చేసిన తర్వాతనే వేరొక చాప్టర్​లోకి వెళ్లాలి. ఎగ్జామ్​లో ప్రతి ప్రశ్నను 45 సెకండ్లలోపు పూర్తి చేయగలగాలి. ఇందులో క్లాసిఫికేషన్​, అనాలజీ, సిరీస్​, వర్డ్​ ఫార్మేషన్​, బ్లడ్​ రిలేషన్స్​, ర్యాంకింగ్​, డైరెక్షన్స్​ & డిస్టాన్స్​, కోడింగ్​– డికోడింగ్​, సిలాగిజమ్​, మ్యాథమెటికల్​ ఆపరేషన్స్​, సీటింగ్​ అరేంజ్​మెంట్​, నాన్​ వెర్బల్​ రీజనింగ్​ తదితర టాపిక్స్​ ఉంటాయి.

జనరల్​ ఇంగ్లిష్​

కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​లో ఇంగ్లిష్​ది​ కీలక పాత్ర. దీన్ని వకాబులరీ, గ్రామర్​ & రీడింగ్​ కాంప్రహెన్షన్​ అని మూడు విభాగాలుగా చదవచ్చు.  వకాబులరి కోసం రూట్​ వర్డ్స్​ తెలిసి ఉండాలి. కొత్త పదాల సినానిమ్స్, ఆంటనిమ్స్​ కనుక్కొని నోట్స్​ ప్రిపేర్​ చేసుకోవడం మంచిది. స్టాండర్డ్​ బేసిక్ గ్రామర్​ బుక్​ ప్రాక్టీస్​ చేయాలి. రీడింగ్​ కాంప్రహెన్షన్​ కోసం రోజూ ఒకటి రెండు పేరాలు తీసుకొని ప్రాక్టీస్​ చేయాలి.  ముందు ప్రశ్నలు చదివిన తర్వాత ప్యాసేజీ చదివితే ఆన్సర్​ చేయడం ఈజీ. ఆర్బీఐ అటెండెంట్స్​ ఎగ్జామ్​లో ఇంగ్లిష్ టెన్త్​ స్టాండర్డ్​ వరకే ఉండే చాన్సు ఉంది కాబట్టి ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ రెఫర్​ చేస్తే యూజ్​ ఉంటుంది.

జనరల్​ అవేర్​నెస్​

జనరల్​ అవేర్​నెస్​లో స్టాటిక్​ జీకే, కరెంట్​ ఎఫైర్స్, జనరల్​ సైన్స్​ తదితర సబ్జెక్టులు ప్రిపేర్​ కావాల్సి ఉంటుంది. స్టాటిక్ జీకేలో పాలసీలు, హిస్టరీ & కల్చర్​, ఎకానమీ, జాగ్రఫి తదితర చాప్టర్లు ఉంటాయి. కరెంట్​ ఎఫైర్స్​లో క్రీడలు, సైన్స్​ & టెక్నాలజీ, జాతీయం, అంతర్జాతీయం, ప్రాంతీయం, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు తదితర రీసెంట్​ డెవలప్​మెంట్స్​ చూసుకోవాలి. జనరల్​ సైన్స్​లో బయాలజీ, ఫిజిక్స్​, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలొస్తాయి. నేషనల్​ స్కీమ్స్​, బుక్స్​ నేమ్స్​ & ఆథర్స్​, ఇంపార్టెంట్​ డేస్​ నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్​ అవేర్​నెస్​పై పట్టు సాధించాలంటే ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ 8,9,10 తరగతుల వారీగా బాగా చదవాలి. బట్టీ పట్టకుండా  ​కాన్సెప్ట్​లు, సంఘటనల ఆధారంగా ప్రిపేరవ్వాలి. స్టాటిక్​ జీకే నుంచి ఎక్కువ మార్కులు వచ్చే చాన్స్ ఉంది కాబట్టి దానిపై స్పెషల్​ పోకస్​ పెట్టాలి.

న్యూమరికల్​ ఎబిలిటీ

న్యూమరికల్​ ఎబిలిటీలో సింప్లిఫికేషన్స్​, డేటా ఇంటర్​ప్రిటేషన్​, నెంబర్​ సిరీస్​, యావరేజస్, మెన్స్యూరేషన్​, పర్సంటేజీలు, రేషియో & ప్రపోర్షన్​, ప్రాఫిట్​ ​& లాస్, టైమ్​–స్పీడ్​– డిస్టాన్స్​, టైం & వర్క్​, పర్మిటేషన్స్​ & కాంబినేషన్స్​, ప్రాబబులిటీ, క్వాడ్రటిక్​ ఈక్వేషన్స్​ చాప్టర్స్​ నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంది. టెన్త్​ స్టాండర్డ్​ లెవెల్​లో ప్రిపేరవ్వాలి.

ఎస్సీ, ఎస్టీలకు ప్రీ టెస్ట్

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గవర్నమెంట్​ నామ్స్​ ప్రకారం ఆర్బీఐ ఆయా రీజినల్​ సెంటర్లలో ప్రీ టెస్ట్​ ట్రైనింగ్​ నిర్వహించనుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఎవరైన ప్రీ టెస్ట్​ ట్రైనింగ్​ పొందాలంటే ఆయా రీజినల్​ సెంటర్​ వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవాలి. శిక్షణ సమయంలో బోర్డింగ్​, ట్రావెలింగ్​ అలవెన్స్​, తదితర ఖర్చులు అభ్యర్థులే భరించుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్​ రీజినల్​ సెంటర్​లో ప్రీ టెస్ట్​ ట్రైనింగ్​ పొందాలనుకునేవారు ఆర్బీఐ–6156, సెక్రటేరియట్​ రోడ్​, సైఫాబాద్​, హైదరాబాద్​–500004, rdhyderabad@rbi.org.in వెబ్​సైట్​లో సంప్రదించవచ్చు.

ఖాళీలు: 841

అర్హత: టెన్త్

దరఖాస్తులు: ఆన్​లైన్​లో

అప్లికేషన్​ ఫీజు: ఓబీసీ/ఈడబ్ల్యూఎస్​/జనరల్​ అభ్యర్థులకు రూ.450, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50

అప్లికేషన్లు ప్రారంభం: 24 ఫిబ్రవరి 2021

చివరి తేది: 15 మార్చి 2021

ఎగ్జామ్​ తేది: 2021 ఏప్రిల్​ 9,10

వెబ్​సైట్​: www.rbi.org.in