
యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO bank) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 30.
పోస్టుల సంఖ్య: 8. తెలంగాణ రాష్ట్రంలో అన్ రిజర్వ్డ్లకు 05, ఓబీసీలకు 03, మొత్తం 8 పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 21.
లాస్ట్ డేట్: అక్టోబర్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. పీడబ్ల్యూబీడీలకు రూ.400. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. 60 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.15,000 జీతం చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు uco.bank.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
►ALSO READ | వరంగల్ NITలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్.. మంచి ఛాన్స్ అప్లయ్ చేసుకోండి..