NIRDPRలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. బిటెక్, పిజి పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

 NIRDPRలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. బిటెక్, పిజి పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIR  DPR) సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టుల సంఖ్య: 09. 

పోస్టులు: సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 01, రీసెర్చ్ అసోసియేట్ 08. 

ఎలిజిబిలిటీ: అగ్రికల్చర్/ సివిల్/ జియో– ఇన్ఫర్మాటిక్స్​లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్సెస్/ ఎర్త్ అండ్ ఎన్విరాన్​మెంట్ సైన్సెస్/ జియో ఇన్ఫ​ర్మాటిక్స్​లో మాస్టర్స్ డిగ్రీ లేదా సోషల్ సైన్సెస్​లో పీహెచ్​డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2025, అక్టోబర్ 29. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nirdpr.org.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | RRB భారీ నోటిఫికేషన్.. రైల్వే జాబ్ కొట్టాలంటే ఇప్పుడే ట్రై చేయాలె.. డిగ్రీతో 5 వేల 810 రైల్వే ఉద్యోగాలు