
ముంబై: ట్విటర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దూసుకెళ్తోంది. అమెరికా, యూరప్ కేంద్ర బ్యాంకులు కూడా శక్తిమంతమైనవే అయినప్పటికీ, ఆర్‌బీఐకే ఎక్కువ మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. ఆర్‌బీఐ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ ట్విటర్ ఎకౌంట్‌ను 7.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. చాలా దేశాల కేంద్రబ్యాంకులు ట్విటర్‌లో ఉన్నప్పటికీ, ఫాలోవర్ల విషయంలో మాత్రం ఆర్‌బీఐ మొదటిస్థానంలో ఉంది. ఆర్‌బీఐకి, గవర్నర్ శక్తికాంత దాస్‌కు వేర్వేరు అకౌంట్లు ఉన్నాయి. 2012 జనవరిలో ఆర్‌బీఐ ట్విటర్‌లో ఎకౌంట్ తెరిచింది.