
వెలుగు : ఏటీఎం లేదా ఇతర పేమెంట్స్ యాప్స్‌లో చెల్లింపులు, డబ్బు లావాదేవీలు ఫెయిలైతే ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని, ఎక్కువ ఆలస్యమైతే జరిమానా కూడా చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ కంపెనీలను ఆదేశించింది. యూపీఐ యాప్స్, కార్డ్స్కీమ్స్, క్రాస్ బార్డర్ ఇన్ బౌండ్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవల సంస్థలు, ఏటీఎమ్‌ల వంటి వాటికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఏటీఎమ్ లావాదేవీల సమస్యలపై ఫిర్యాదు కోసం కస్టమర్లకు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ డెస్క్ నెంబర్లు వంటి వాటిని అందుబాటులో ఉంచాలని స్పష్టీకరించింది. ఇలాంటి మార్గదర్శకాలనే మరింత మంది ఆపరేటర్లకు కూడా వర్తింప చేసేందుకు ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. కస్టమర్ ఫిర్యాదును పరిష్కరించే సమయం ఒక్కో చెల్లింపు సంస్థకు ఒక్కోలా ఉందని ఆర్‌బీఐ గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీఏటీ (టర్న్ అరౌండ్ టైమ్)ను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని యోచిస్తోంది. కస్టమర్ల ఫిర్యాదులు, చార్జ్‌బాక్స్‌తో పాటు పరిహారానికి ఒకఫ్రేమ్‌వర్క్ ఉండాలని భావిస్తోంది. టీఏటీపై జూన్చివరి నాటికల్లా ఒక కచ్చితమైన ఫ్రేమ్‌వర్క్ నుఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.