
హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ, ఆర్బీఎల్ బ్యాంకుతో బ్యాంక్ అష్యూరెన్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ఆర్బీఎల్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ నెట్‌వర్క్ డిజిటల్ చానెళ్ల నుంచి ఎల్ఐసీ ప్రొడక్టులను కొనొచ్చు. ఈ అధికారిక ఒప్పందాన్ని ఎల్ఐసీ ఎండీ, సీఈఓ ఆర్. దొరైస్వామి, ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సుబ్రమణ్య కుమార్, ఇతర సీనియర్ అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 30) ప్రకటించారు.
భారతదేశంలో ఆర్థిక రక్షణను విస్తరించడానికి, బీమా వ్యాప్తిని బలోపేతం చేయడానికి రెండు సంస్థల నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనం. ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్లు ఇక నుంచి ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలోని టర్మ్ ప్లాన్స్, ఎండోమెంట్ పాలసీలు, పెన్షన్ యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పొందవచ్చు.
ఎల్ఐసీకి 3,600కుపైగా బ్రాంచ్‌లు, శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంకుకు దాదాపు 570 బ్రాంచ్‌లు 1,474 బిజినెస్ కరస్పాండెంట్ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా జీవిత బీమా వ్యాప్తి పెరుగుతుందని, "2047 నాటికి అందరికీ బీమా" లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తున్నారు.