RCB vs MI : హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, డుప్లెసిస్

RCB vs MI : హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, డుప్లెసిస్

ముంబైతో జరుగుతోన్న  మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. బెంగళూరు ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, డుప్లెసిస్  ముంబై బౌలర్లకు చుక్కులు చూపెట్టారు.  ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా వచ్చిన బాల్ ను వచ్చినట్టుగా బౌండరీ తరలించారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్ 73 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు  15 ఓవర్లు ముగిసే సరికి  ఒక వికెట్ నష్టపోయి 148 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 71, దినేశ్ కార్తీక్ ఉన్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  171   పరుగులు చేసింది.  చివర్లో తిలక్‌ వర్మ దూకుడుగా ఆడాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి.  ముంబయి జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (10), రోహిత్‌ శర్మ (1) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తరువాత వచ్చిన కామెరూన్‌ గ్రీన్‌ (5) కూడా త్వరగానే వెనుదిరిగాడు.  50 దాటక ముందే ముంబయి జట్టు కీలకమైన నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తిలక్‌ వర్మ వరుసగా సిక్సర్లు, ఫోర్లతో జట్టు స్కోర్ ను పెంచాడు.  తిలక్‌ 46  బంతులను ఎదురుకుని 84 పరుగులు చేశాడు.   అతడు చేసిన స్కోర్ వలనే ముంబయి ఈ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది.  బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ రెండు, హర్షల్‌ పటేల్, బ్రేస్‌వెల్‌ , ఆకాశ్‌ దీప్‌ , టాప్లీ, సిరాజ్‌ చెరో వికెట్ తీశారు.