అక్విజిషన్ ఫైనాన్సింగ్కు రెడీ.. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి

అక్విజిషన్ ఫైనాన్సింగ్కు రెడీ.. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి

ముంబై: బ్యాంకులు అక్విజిషన్ ఫైనాన్సింగ్‌‌ చేసేందుకు ఆర్‌‌బీఐ అనుమతించడాన్ని ఎస్​బీఐ చైర్మన్​ చల్లా శ్రీనివాసులు​ శెట్టి స్వాగతించారు. ఎస్​బీఐ లాంటి బ్యాంకులు ఈ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించగలవని అన్నారు. ఒక కంపెనీ మరొక కంపెనీని కొనడానికి లేదా దానిలో పెద్ద వాటాను తీసుకోవడానికి నిధులను సమకూర్చడాన్ని అక్విజిషన్ ఫైనాన్సింగ్‌‌ అంటారు. 

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్​టెక్ ఫెస్ట్​లో శెట్టి మాట్లాడుతూ, విదేశీ సంస్థలను కొనుగోలు చేసే భారతీయ కార్పొరేట్​లకు తాము లోన్లు ఇస్తున్నామని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే యూపీఐ క్రెడిట్ సొల్యూషన్​తో లింక్ చేసి, వ్యవసాయ లోన్లు ఇవ్వడానికి కూడా ఎస్​బీఐ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.  

త్వరలోనే యోనో యాప్​ కొత్త వెర్షన్ తెస్తామని, మొదటి రోజే 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకునే సామర్థ్యం దీనికి ఉంటుందని శెట్టి చెప్పారు.   కేవైసీ రూల్స్​ను సులువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.