
హైదరాబాద్, వెలుగు: డాబర్ రియల్ ఫ్రూట్ జ్యూస్ బ్రాండ్, రియల్ యాక్టివ్ పేరుతో కొత్త రకం పండ్ల రసాలను విడుదల చేసింది. వీటిని నిజమైన పండ్లతో తయారు చేయడం వల్ల సహజమైన రుచి ఉంటుందని కంపెనీ తెలిపింది. అదనపు చక్కెరలను చేర్చలేదని, ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వినియోగదారులకు ఇవి అనువైనవని పేర్కొంది. ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, పోషకాలను అందించడానికి రియల్ యాక్టివ్ ఉపయోగపడుతుందని తెలిపింది. రియల్ యాక్టివ్ జ్యూసులు యాపిల్, నారింజ, దానిమ్మ, కాన్ బెర్రీ మిక్స్‌డ్ ఫ్రూట్ వంటి వివిధ రుచులలో అందుబాటులో ఉంటాయి.