సౌదీలో హౌస్ కీపింగ్ పేరుతో ఉద్యోగానికి తీసుకెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా చేర్చుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాథోడ్ నాందేవ్ ను తెలంగాణాకు రప్పించారు. తెలంగాణకు చెందిన రాథోడ్ నాందేవ్ దుబాయ్ లో హౌస్ కీపింగ్ జాబ్ కోసం ఓ ఏజెంట్ ద్వారా వెళ్లాడు. లక్షా 20వేలు ఇచ్చి దుబాయ్ లో హౌస్ కీపింగ్ జాబ్ ఇప్పిస్తా అని ఏజెంట్ మోసం చేశాడు.
అక్కడికి వెళ్లిన రాథోడ్ నాందేవ్ ను దుబాయ్ షేక్ లు బలవంతంగా ఒంటెల కాపరిగా జీతం పెట్టుకున్నారు. రాథోడ్ వేధింపు తట్టుకోలేక తనను ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో తెలంగాణ సీఎంఓ కార్యాలయం స్పందించింది. వెంటనే దుబాయిలోని ఎంబసీను సంప్రదించి అక్కడి అధికారుల ద్వారా రాథోడ్ నాందేవ్ ను రక్షించారు. తిరిగి ఇండియా రప్పించారు.
Also Read:-ఐఫోన్ కోసం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి చంపేశాడు
బాధితుడు రాథోడ్ నాందేవ్ అక్టోబర్ 1న ఉదయం 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. రాథోడ్ నాందేవ్ కి శంషాబాద్ విమానాశ్రయంలో గల్ఫ్ బాధితుల సంఘం నేత మంద భీమ్ రెడ్డి, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. చాలా ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని చూసిన రాథోడ్ బావోద్వేగానికి గురైయ్యాడు. ఎడారిలో ఒంటెల కాపరిగా దుబాయ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొని వాపోయాడు. తనను రక్షించిన తెలంగాణ ప్రభుత్వానికి, దుబాయ్ లో సహకరించిన అధికారులకు రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.