
రియల్‌మీ తమ సరికొత్త 15 సిరీస్ ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో ఇండస్ట్రీ- ఫస్ట్ ఏఐ ఎడిట్ జీనీ ఫీచర్, 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, హైక్వాలిటీ కెమెరాలు, సెగ్మెంట్- లీడింగ్ పెర్ఫార్మెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. హైఎండ్ మోడల్ రియల్‌మీ 15 ప్రోజీ నాలుగు స్టోరేజ్ రకాలలో(8+128, 8+256, 12+256, 12+512)అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.29 వేల నుంచి మొదలవుతాయి. రియల్‌మీ15జీ మూడు స్టోరేజ్ రకాలలో(8+128, 8+256, 12+256) అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.24 వేల నుంచి మొదలవుతాయి. ఈ నెల 30 నుంచి ఈ రెండు ఫోన్లను ఆర్డర్ చేయవచ్చు.