
హైదరాబాద్, వెలుగు: రియల్‌మీ దేశీయ మార్కెట్లో 15టీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ముందు, వెనుక 50ఎంపీ ఏఐ కెమెరాలు, 7.79 ఎంఎం బాడీ, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ , అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మాక్స్ 5జీ ప్రాసెసర్, ఐపీ66/68/69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
రియల్‌మీ 15టీ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ ధర రూ.18,999 కాగా, 8జీబీ+256జీబీ ధర రూ.20,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ రేటు రూ.22,999 ఉంటుంది. ఈ ఫోన్‌కు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రీ-బుకింగ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు మొదటి సేల్ జరుగుతుంది.