Realme GT 6T 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..అదిరిపోయే ఫీచర్లు, ధర ఇవిగో..

Realme GT 6T 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..అదిరిపోయే ఫీచర్లు, ధర ఇవిగో..

Realme స్మార్ట్ ఫోన్ కంపెనీ..GT సిరీస్ లో భాగంగా కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత Realme మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ డివైజ్ ఇటీవల చైనా మార్కెట్ లో Realme GT Neo 6 SE 5G పేరుతో రీలీజ్ అయింది. ఈ మోడల్ కొన్ని మార్పులతో ఇప్పుడు భారతదేశ  మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ హ్యాండ్ సెట్ ధర రూ. 25వేలు. 

Realme GT 6T 5G గేమింగ్ హ్యాండ్‌సెట్ ఫీచర్లు

  • 6.78-అంగుళాల 1.5K LTPO 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 
  • 120Hz రిఫ్రెష్ రేట్‌, 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ 
  • Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌
  • 12GB వరకు LPDDR5x RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
  • 5,500mAh బ్యాటరీతో సపోర్టు
  • 120W టైప్ C ఫాస్ట్ ఛార్జర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరే టింగ్ సిస్టమ్ Realme UI 5.0 తో రన్ అవుతోంది. 
  • Google Gemini AI ఫీచర్‌ కూడా ఉంది. 

వేరియంట్, ధర

Realme GT 6T 5G నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

  • 8GB RAM + 128GB రూ. 24,999
  • 8GB RAM + 256GB రూ. 26,999
  • 12GB RAM + 256GB రూ. 29,999
  • 12GB RAM + 512GB రూ. 33,999

Realme GT 6T 5G హ్యాండ్ సెట్ రెండు కలర్లలో లభిస్తోంది. రేజర్ గ్రీన్, ఫ్లూయిడ్ సిల్వర్. 

Realme GT 6T 5G పై ఆఫర్లు 

Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మే 29 నుంచి అమెజాన్, Realme.com  ద్వారా ప్రారంభం అవుతాయి. ఈ కొత్త గేమింగ్ మొబైల్ లాంచింగ్ సందర్భంగా మే 29నుంచి జూన్ 1 డీల్ లను అందిస్తోంది. ఇందులో అదనంగా రూ. 2వేల బోసన్, ఫోన్ కొనుగోలుపై రూ. 4వేల స్పాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తోంది.