రాజ్-కోటీ హిట్ కాంబో.. ఎందుకు విడిపోయారు?

రాజ్-కోటీ హిట్ కాంబో.. ఎందుకు విడిపోయారు?

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) కన్నుమూశారు.  గతకొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2023, మే 21 ఆదివారం రోజున బాత్ రూమ్ లో కాలు జారిపడి చనిపోయారు. దీంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రేపు ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు 
జరగనున్నాయి. 
 
రాజ్ పూర్తిపేరు తోటకూర సోమరాజు. ఆయన తండ్రి ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు. తండ్రి సంగీత దర్శకుడు కావడంతో రాజ్ కి కూడా చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఏర్పడింది. 1983లో మోహన్ బాబు హీరోగా వచ్చిన ప్రళయ గర్జన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజ్. ఈ సినిమాకు కోటీ కూడా పనిచేశారు. అలా ప్రారంభమైన రాజ్-కోటీ ప్రయాణం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మారిపోయింది. వారు చేసిన అన్ని సినిమాలు, అన్ని పాటలు సూపర్ హిట్సే. వారి సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు ఈ జోడి. 

80 దశకంలో అయితే సినిమా ఏదైనా రాజ్-కోటీ ఉండాల్సిందే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ ఈ సంగీత ద్వయం. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి వెస్ట్రన్ మ్యూజిక్ ను పరిచయం చేయడంలో వీరి పాత్ర ఎక్కువ. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు.  ఆతరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజ్ కోటీ విడిపోయారు.

 ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాలు కారణం అని చెప్పుకుంటారు కానీ.. ఆ విషయం పై ఈ ఇద్దరు ఎక్కడ నోరువిప్పక పోవలేదు., వీరిద్దరూ విడిపోయాక రాజ్ ఎక్కువ సినిమాలకు సంగీతం అందించలేదు. ఆయన ఒంటరిగా సంగీతం అందించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే సిసింద్రీ అనే చెప్పాలి. ఆతరువాత సినిమాలు చేయడం మానేసాడు రాజ్. ఈ క్రమంలోనే సినిమాలకు కూడా దూరమయ్యాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు.