నిరుద్యోగులకు ISLRTCలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. పరీక్ష లేకుండ డైరెక్ట్ జాబ్..

నిరుద్యోగులకు ISLRTCలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. పరీక్ష లేకుండ డైరెక్ట్ జాబ్..

ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ISLRTC) రీసెర్చ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టులు: 04.

ఖాళీల వివరాలు: రీసెర్చ్ స్టాఫ్ 01, రీసెర్చ్ అసిస్టెంట్ 01, డిజైనర్/ ఇలస్ట్రేటర్ 01, డెఫ్ టీచర్ 01. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి బి.ఎడ్. / ఎంఏ (విద్య/భాషాశాస్త్రం), డి.ఎడ్. స్పెషల్ ఎడ్యుకేషన్ / డీఐఎస్ఎల్ఐ / డీటీఐఎస్ఎల్ / ఐఎస్ఎల్ సీ లెవెల్ / డిజైన్ సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐఎస్ఎల్ ‘సి’ లెవెల్ లేదా డీటీఐఎస్ఎల్​తో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2026, జనవరి 05.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు islrtc.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి.