
మరో మలయాళ అమ్మాయి టాలీవుడ్‌లో బిజీ అవుతోంది. తను తెలుగువారికి కొత్తేమీ కాదు. విజయ్ నటించిన ‘విజిల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే ఈసారి హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. తనెవరో కాదు.. రెబా మోనికా జాన్. అను ఇమ్మాన్యుయేల్‌కి కజిన్ అయిన రెబా 2016లో మలయాళీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత మరో రెండు చిత్రాలు చేసింది. ‘విజిల్’ మూవీలో యాసిడ్ అటాక్ విక్టిమ్‌గా సూపర్బ్‌గా పర్‌ఫార్మ్ చేయడంతో బాగా పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తోంది. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ అనే తెలుగు, తమిళ బైలింగ్వల్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమాకి ఎస్ చెప్పింది. ‘వివాహ భోజనంబు’ సినిమా తీసిన రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు శ్రీవిష్ణు. దండ రాజేష్‌తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.
ఈ చిత్రంలో రెబాని హీరోయిన్‌గా తీసుకున్నట్టు నిన్న ప్రకటించారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీప్రసాద్, ప్రియ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది.