టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి

టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి

టికెట్​ దక్కకపోవడంతో అసమ్మతుల ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్​గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అధికార టీఆర్ఎస్​పార్టీకి రెబల్స్​బెడద ఎక్కువగా ఉంది. సిట్టింగ్​ కార్పొరేటర్లలో 26 మందికి టికెట్లు ఇవ్వకపోవడం, ఇతర స్థానాల్లోనూ ఏళ్లుగా టికెట్ల కోసం చూస్తున్నవారికి దక్కకపోవడంతో రెబల్స్ గా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

అధికార పార్టీలో ఆందోళనలు

20 ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తనకు బాలాజీనగర్​డివిజన్​టికెట్​ఇవ్వలేదని మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్​భవన్​ముందు నిరసన తెలిపారు. కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే ఒత్తిడితోనే తనకు టికెట్ దక్కలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్  స్పందించాలని కోరారు. నిరసనకు దిగిన మల్లేష్ యాదవ్‌‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. దీంతో ఆయన రెబల్​అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. అడిక్‌‌మెట్ డివిజన్‌‌లో టీఆర్ఎస్ నుంచి బి.మనోహర్ సింగ్ కు టికెట్​ దక్కకపోవడంతో ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు. తమకే టికెట్ కేటాయించాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ సమక్షంలోనే గొడవకు దిగారు. మనోహర్​కు అన్యాయం జరిగిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను నిలదీశారు. చివరకు పాత అభ్యర్థి హేమలతారెడ్డి పేరును ప్రకటించి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్​ నుంచి బాలానగర్​డివిజన్​టికెట్ఆశించిన సంతోష్ గుప్తా చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో కలిసి శుక్రవారం నామినేషన్​వేశారు. రాంచంద్రాపురం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనుకున్న పరమేష్​యాదవ్ టికెట్​దక్కకపోవడంతో రెబల్​గా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. టికెట్​కేటాయింపు విషయం చంపాపేట్ లో టీఆర్ఎస్​నేతల మధ్య గొడవకు దారితీసింది. ఆ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి నిర్వహించిన అంతర్గత సమావేశం రసాభాసగా మారింది. సామ రఘుమారెడ్డికి టికెట్​ఇవ్వకపోవడంపై ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి ముందే రచ్చ రచ్చ చేశారు. సుధీర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మాదాపూర్​ టికెట్​ఆశించిన శ్రీనివాస్ యాదవ్​అనుచరులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రెబల్​గా పోటీ కి సిద్ధమయ్యారు. కాచిగూడ సిట్టింగ్​ కార్పొరేటర్​ ఎక్కల చైతన్య యాదవ్ కు పార్టీ మరోసారి టికెట్​ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్ పేట్​డివిజన్​నుంచి లాస్ట్​ టైం ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన చెర్క మహేష్ కి ఈ సారి టికెట్​ దక్కలేదు.

వేధింపులు తాళలేక టీఆర్ఎస్​కు గుడ్ బై

టీఆర్ఎస్​పార్టీలో విభేదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్​వేధింపులు తాళలేక​పార్టీకి ఓ మహిళా లీడర్​రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో ఉన్నా తనకు సపోర్టు చేయడం లేదంటూ గురువారం రాత్రి ఫసియోద్దిన్​అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని షర్మిల జాదవ్​ఆరోపించారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫసియోద్దిన్​అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ రాత్రంతా స్టేషన్​లోనే ఉన్నారు. తనపై  నిందారోపణలు చేస్తున్నందుకు టీఆర్ఎస్​పార్టీకి రాజీనామా చేశానని, శనివారం తన భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

రూ. 2 కోట్లు ఉంటేనే టికెట్

తార్నాక సిట్టింగ్​ కార్పొరేటర్​సరస్వతి డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై ఫైర్ అయ్యారు. రెండు కోట్లు ఉంటేనే టికెట్ ఇస్తానని పద్మారావు తనతో అన్నారని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​తనకే టికెట్​ఇద్దామనుకున్నప్పటికీ పద్మారావు కావాలనే తనకు రాకుండా చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్​ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనకు టికెట్​ రాకుండా చేశారని మండిపడ్డారు. 150 డివిజన్ ల్లో ఒకే ఒక్క వడ్డేర సీట్​ఇదని, అదీ ఇప్పుడు అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని పద్మారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 లో ఇక్కడి నుంచి 14 వేల మెజారిటీతో గెలిచానని, అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. టీఆర్ఎస్​ రెబల్​గా పోటీ చేస్తానని, టీఆర్ఎస్​ జెండాలు, కండువాలు వేసుకొని ప్రచారం చేస్తానని సరస్వతి ప్రకటించారు.

For More News..

ఎన్నికల సామాన్లకు ఫుల్ గిరాకీ

వరద సాయం కాదది.. ఓటుకు నోటు

ట్రంప్ కాదన్నడు.. బైడెన్ యెస్ అన్నడు