
మనదేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 19లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రికార్డ్ స్థాయిలో 57,584మంది రోగులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 72శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 57,981 కేసులతో మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 26,47,663 కు పెరిగింది. తాజా 941 మరణాలతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 50,000 మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి